ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల గురించి, తారక్ గురించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.నాకు బాగా నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఈ విషయాన్ని ఓపెన్ గా చెబుతున్నానని అతనిలో ఉన్న పొటెన్షియాలిటీ మరెవరిలో లేదని కోట కామెంట్లు చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటులు ఉన్నా తారక్ అంటే నాకు చాలా ఇష్టమని ప్రాంక్ గా చెబుతున్నానని ఆయన తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ రీప్లేస్ చేశారని జూనియర్ ఎన్టీఆర్ అని అభిమానులు అనుకుంటున్నారు కదా అది చాలదా అని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ కు వాక్చాతుర్యం ఉందని డైలాగ్స్ బ్రహ్మాండంగా చెబుతాడని మెమొరీ ఉందని పొటెన్షియాలిటీ ఉందని డ్యాన్స్ లు బాగా చేస్తాడని కోట కామెంట్లు చేశారు.తారక్ ను బుడ్డోడు బుడ్డోడు అంటారని తారక్ అంటే నాకు చాలా అభిమానమని కోట తెలిపారు.

బాబాయ్ బాబాయ్ అని తారక్ ప్రేమగా పిలుస్తారని కోట అన్నారు. బన్నీ, మహేష్ అంటే కూడా ఇష్టమని ఆయన తెలిపారు.రాజమౌళి, రామానాయుడు సినిమాలలో పని చేస్తే వాళ్లకు వచ్చిన స్థాయిలో ఆర్టిస్టులకు పేరు రాలేదని ఆయన తెలిపారు.తారక్ గురించి కోట చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తారక్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ కు వెళ్లారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా రేంజ్ ను మరింత పెంచడానికి తారక్, చరణ్ ఎంతగానో కష్టపడుతున్నారు.తారక్ రాజమౌళి కాంబోలో మరో సినిమా రానుందని రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.







