కొందరికి అదృష్టం ఎలా వస్తుందో తెలియదు కానీ చెప్పా పెట్టకుండా, షాకుల మీద షాకులు ఇస్తూ ఒక్కసారిగా ఊడిపడుతుంది.ఇది నిజమా కల కాదుగా అనేట్టుగా ఉబ్బితబ్బిబ్బై పోతుంటారు కొందరు.
ప్రస్తుతం ఇలాంటి అనుభూతినే పొందుతున్నాడు భారత సంతతికి చెందిన ఎన్నారై.అనుకోకుండా ఒక్క రోజు ముందు కొనుగోలు చేసిన టిక్కెట్టు తో ఏకంగా 1 కేజీ బంగారం గెలుచుకోవడంతో , తన పేరును బిగ్ టిక్కెట్ డ్రా వాళ్ళు ప్రకటించడంతో ఇప్పటికి షాక్ లోనే ఉన్నానని అంటున్నాడు.
ఇంతకీ అతడి పేరు ఏంటి, ఈ అదృష్టానికి ముందు అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.
భారత్ కి చెందిన జయకుమార్ తిరునావుకరుసు అనే వ్యక్తీ గడిచిన మూడేళ్ళుగా యూఏఈ రాజధాని అబుదాబులో ఉంటున్నాడు.
అబుదాబి లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేసుకుంటున్న జయకుమార్ భారతీయులకు అబుదాబి లక్కీ డ్రా లలో ఎక్కువగా లాటరీ టిక్కెట్లలో అదృష్టం వరించడం తెలుసుకున్నాడు.దాంతో వెళ్ళిన రోజు నుంచీ లక్కీ డ్రా లో టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు.
టిక్కెట్టు కొన్న ప్రతీ సారి అదృష్టం వరించక పోయినా నిరుశ్చహానికి లోనవకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.అయితే కొన్ని రోజుల క్రితం అంటే.

అక్టోబర్ 17 తేదీన తీయాల్సిన లక్కీ డ్రాలో సరిగ్గా ముందు రోజు అక్టోబర్ 16 వ తేదీన బిగ్ టిక్కెట్ డ్రా లో టిక్కెట్టు కొనుగోలు చేసాడు.ఈ సారైనా అదృష్టం తనని వరించక పోదా అనుకున్నాడు.అయితే చివరిగా ఒక్క రోజు మిగిలి ఉన్న సమయంలో కొనుగోలు చేసిన టిక్కెట్టు కే అదృష్టం వరించింది.లక్కీ డ్రా నిర్వహించిన నిర్వాహకులు జయకుమార్ కొనుగోలు చేసిన టిక్కెట్టు కు 1 కేజీ బంగారం గెలుచుకున్నట్టుగా ప్రకటించారు.
దాదాపు 3 ఏళ్ళుగా ఈ బిగ్ టిక్కెట్ లో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నానని అయితే ఇన్నేళ్ళ తరువాత తనకు లక్కు కలిసొచ్చిందని ఇకపై కూడా తాను లాటరీ టిక్కెట్లు కొనులు చేస్తూనే ఉంటానని జయకుమార్ తెలిపారు.







