తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఈమె తరచూ చూసిన మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ఇక ఈమె ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో వైరల్ అవుతూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.కానీ ఆమె తల్లి అయిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
దీంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ చిన్మయి కూడా సరోగసి ద్వారానే పిల్లలకు జన్మనిచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలను సృష్టించారు.
ఆ వార్తలపై స్పందించిన చిన్మయి ఒక వీడియోని విడుదల చేసింది.
ఆ వీడియోలో ఆమె తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు పులిస్టాప్ పెట్టేసింది.అయితే గతంలో గర్భస్రావం కావడంతో ఇటువంటి విషయాలను ఎక్కువగా బయటకు చెప్పలేదని ఆమె తెలిపింది.
దాదాపు 8 నెల తర్వాత నా ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాను.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
నేను ఇప్పటికే ఎన్నో రకాల చానల్స్ లో మొదటిసారి గర్భస్రావం అయిన విషయాన్ని తెలిపాను.మొదటిసారి జరిగిన సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తుంది.
కడుపుతో ఉన్నప్పటికీ నా వృత్తి జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్లాను.

ఆ సమయంలో ఎవరు ఫోటోలు తీయవద్దని వ్యక్తిగత విషయాలకు భంగం కలిగించవద్దు అని విజ్ఞప్తి చేసేదాన్ని చెప్పుకొచ్చింది సింగర్ చిన్మయి.సరోగసి, ఐవీఎఫ్, సహజ గర్భం ఇలా ఏ రూపంలోనైనా పిల్లల్ని కావాలనుకోవడం నాకు పెద్ద విషయం కాదు.మనుషులైనా జంతువులైనా అమ్మ అంటే అమ్మే.
నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని ఎవరైనా అనుకుంటే నేనేమీ పట్టించుకోను.ఎవరు ఏదైనా అనుకోండి.
అది వాళ్ల అభిప్రాయం.నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అంటూ తనని సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారికి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది చిన్నయి.
అంతేకాకుండా అలాగే తన ఇద్దరి బిడ్డలకు ఫీడింగ్ ఇస్తున్న ఫొటోను కూడా షేర్ చేసి ప్రపంచంలో అత్యుత్తమమైన ఫీలింగ్ ఇది అని పేర్కొన్నారు.మొత్తానికి తాను సరోగసి ద్వారా కాకుండా సహజంగానే తల్లి అయినట్లు ఆ ఫోటోలు వీడియోలు ద్వారా స్పష్టతనిచ్చింది చిన్మయి.







