తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.సుమారు తొమ్మిది రోజులపాటు కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగింది.
కాసేపట్లో కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరనున్నారు అని సమాచారం, ఢిల్లీ పర్యటనలో బిఆర్ఎస్, టిఆర్ఎస్ కార్యాలయాలను కెసిఆర్ సందర్శించారు.జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలువురు ప్రముఖులతో కెసిఆర్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఏపీలో పర్యటనపై కేసీఆర్ దృష్టి సారించే అవకాశం ఉంది.విజయనగరం లేదా విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోజనలో టిఆర్ఎస్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.







