ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోకుండా జీవిస్తే చాలా రకాల అనారోగ్యా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.మానవ శరీరానికి అవసరమైన ఏ పౌష్టికాహారాన్ని అయినా మనిషి ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.
అలా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉంటుంది.మనిషి శరీరానికి ప్రతిరోజు క్యాల్షియం తగిన పరిమాణంలో అవసరమవుతుంది.
క్యాల్షియం అనగానే ఎముకల పటుత్వనికి ఉపయోగపడుతుందని చాలామందికి తెలుసు.
అయితే ఇది ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు.
రక్తం మామూలుగా గడ్డ కట్టేలా చూడటం లాంటి ఎన్నో సమస్యలకు ఉపయోగపడుతుంది.శరీర కండరాలు నాడులు సరిగ్గా పనిచేయడానికి క్యాల్షియం ఉపయోగపడుతుంది.
గుండె సాధారణంగా కొట్టుకునేలా చేయడానికి కూడా ఈ కాల్షియం ఎంతో సహాయపడుతుంది.క్యాల్షియం చాలావరకు ఎముకలలోనే ఉంటుంది.
ప్రతిరోజు మానవ శరీరానికి తగినంత కాల్షియం తీసుకోకపోతే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది.

ఎముకలకు తగినంత కాల్షియం లేకపోతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.ఫలితంగా గుండె అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.అందువల్ల మన శరీరానికి ఎప్పుడూ తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవడం మంచి.
ముఖ్యంగా చాలామంది వయసు ఎక్కువగా ఉన్నవారు క్యాల్షియం మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు.

ఈ మాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెద్దవారికి సగటున రోజుకు 1,000 నుంచి 1,200 మి.గ్రా.క్యాల్షియం అవసరం అవుతుంది.అందువల్ల మనం రోజు తీసుకునే ఆహారంలోనే తగినంత క్యాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.వాటిలో పాలు పెరుగు చీజ్ బాదం సోయా జీడిపప్పు లాంటి వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి క్యాల్షియం లభించే ఆహార పదార్థాలను రోజుకు రెండు నుండి నాలుగు సార్లు తీసుకోవడం వల్ల శరీరానికి క్యాల్షియం బాగా అందుతుంది.