సోషల్ మీడియా పరిధి రోజురోజుకీ విస్తరించడంతో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలో నచ్చిన వీడియోలను నెటిజన్లు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
దాంతో సదరు వీడియోస్ కంటెంట్ బాగా వైరల్ అవుతోంది.తాజాగా ఓ తండ్రీ కొడుకులకు సంబంధించిన వీడియో ఒకటి బాగా హల్ చల్ చేస్తోంది.
దాన్ని చూసిన నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.ఇద్దరు తండ్రీ కొడుకులు చేపల వేటకు వెళితే అనూహ్యంగా ఓ భారీ తిమింగలం వారి బోట్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.వివరాల్లోకి వెళితే జాక్ పిల్లర్ అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసాడు.
ఈ కంటెంట్ ఇప్పటికి 74000 మందికి పైగా చూడటం విశేషం.అలాగే దీనిని ఓ 34000 మందికి పైగా లైక్ చేసారు.అలాగే కామెంట్లకైతే లెక్కేలేదు మరి.‘తండ్రీ కొడుకులు బాగా సరిపోయారు.వారికి అలా సాగుతుంది.’ అని ఒకరంటే, ‘తిమింగళాన్ని వాడ గుద్దిందా లేక ఓడని తిమిళింగలం గుద్దిందా?’ అని మరొకరు….‘తిమింగలం మీమీద పగబట్టింది… పారిపోండి’ అని వేరొకరు కామెంట్ చేసారు.

వీడియోలో ఏముందంటే, తండ్రీ కొడుకులు బోట్‌లో ఫిషింగ్‌కు వెళ్లారు.ఇంతలో అనుహ్య సంఘటన జరిగింది.ఒక్క ఉదుటున ఓ భారీ తిమింగలం వారి బోట్‌వైపు విమానంలాగా దూసుకొచ్చింది.
కాగా ఈ హటాత్పరిణామానికి కొడుకు బాగా భయపడిపోయాడు.అతని తండ్రి మాత్రం మిస్టర్ కూల్ లాగ భయపడకుండా యేమి జరగదు అన్నట్టు అలా చూస్తూ వున్నాడు.
అక్కడితో ఆగకుండా అతగాడు ఆ భారీ తిమింగలం ఫుటేజ్ షేర్ చేస్తూ… “మా బోట్‌ను ఓ వైపు ఢీ కొట్టిందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్” ఇచ్చాడు.







