భార్యతో జపాన్ బయల్దేరిన చరణ్.. పిక్ వైరల్!

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా పాన్ వరల్డ్ గా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

 Ram Charan And Upasana Fly To Japan With Their Pet Rhyme For Rrr Promotions Deta-TeluguStop.com

బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.ఈ సినిమా క్రేజ్ తోనే ప్రెజెంట్ వీరు తిరుగులేని స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కోసం నాలుగేళ్ళ పాటు ప్రేక్షకులు నిరీక్షించిన వారి నిరీక్షణకు ఫలితం దక్కింది.మరి అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి జపాన్ బయల్దేరాడు.

వెకేషన్ కోసం అని అనుకుంటున్నారు.కానీ కాదు.

త్వరలోనే జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కాబోతుంది.

Telugu Japan, Rajamouli, Ram Charan, Ramcharan, Rrr Japan, Rrr, Upasana-Movie

ఈ బెస్ట్ ఎవర్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

ఈ క్రమంలోనే ఎప్పటి నుండో రాజమౌళి అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం కోసం తనవంతు కృషి చేస్తున్నారు.

మరి ఇప్పుడు చరణ్ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం కోసం జపాన్ బయల్దేరాడు.తన భార్యతో కలిసి వెళుతున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.అక్కడ ప్రొమోషన్స్ చేసి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన వంతు పాత్ర పోషించ బోతున్నారు.డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.

మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube