నలుపు రంగు అనేది అశుభమని మనలో కొందరికి ఓ అపోహ ఉంటుంది.అయితే ఇందులో నిజమెంత అనే విషయం తెలుసుకోకుండానే దీనిని ప్రతిదానికి ఆపాదిస్తూ వుంటారు.
ఈ క్రమంలో కొందరు నల్లని దుస్తులు వాడాలంటే వెనకడుగు వేస్తూ వుంటారు.అలాగే నలుపు రంగు వాహనాలు కొనాలన్నా తటపటాయిస్తారు.
ఇంకొందరైతే బ్లాక్ కలర్ కార్లుతో వెళితే ప్రమాదాలు సంభవిస్తాయని భ్రమ పడుతూ వుంటారు.ఈ విషయం గురించి తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ప్రస్తావించారు.
ఆనంద మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.ప్రపంచంలో ఎక్కడ, ఎలాంటి ఘటనలు జరిగినా తనదైన శైలిలో ఆయన స్పందిస్తుంటారు.తాజాగా వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు కలర్ ఆధారంగా కార్ల ప్రమాదాలు జరుగుతాయని ఓ పోస్ట్ చేశారు.అయితే ఆ విషయాన్ని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో తప్పుబట్టారు.
విషయంలోకి వెళితే కారు కలర్‌ను బట్టి క్రాష్ రిస్క్‌ను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా ఓ అంచనా వేసింది.
ఈ క్రమంలో బ్లాక్ కలర్ కార్లతో 47% ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,
రెడ్ కలర్ కార్లతో 7%, గ్రే కలర్ కార్లతో 11%, సిల్వర్ కలర్ కార్లతో 10% వరకు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా ట్వీట్ చేసింది.ఇక వైట్, ఆరెంజ్, ఎల్లో, గోల్డ్ కలర్ కార్లతో తక్కువ ప్రమాదాలు జరుగుతాయని కూడా వెల్లడించింది.అయితే ఈ సర్వేకి ఆనంద్ మహీంద్రా చురకలు అంటించారు.
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు ఇచ్చిన గణాంకాలను సరియైనవి కాదని, ‘అబద్ధాలు.హేయమైన అబద్ధాలు, గణంకాలు.
అస్పష్టం’ అని అర్థం వచ్చే ఇంగ్లీష్ వాక్యాలను ట్వీట్ చేశారు.కాగా ఆనంద్ పోస్టుతో కొంతమంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.