ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.పేరుకు పార్టీ ఉన్నా… పెద్దగా కార్యకలాపాలు ఏమి చోటు చేసుకోవడం లేదు.
అప్పుడప్పుడు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు తులసి రెడ్డి , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ వంటి వారు వివిధ సమస్యలపై స్పందించడం తప్ప, మిగిలిన ఏ విషయాల్లోనూ ఆ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ గా కనిపించడం లేదు.ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లోను కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటూ వస్తోంది.2014 ఎన్నికల నుంచి దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.అయితే ప్రస్తుత కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సాకే శైలజానాథ్ ఈ పదవిపై అంతగా ఆసక్తి కనపరచడం లేదు.
అలాగే పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు.ఇక ఆ బాధ్యతలను స్వీకరించేందుకు మిగతా కాంగ్రెస్ సీనియర్లు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
గతంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.ప్రజా క్షేత్రంలో కి వచ్చి వివిధ సమస్యలపై పోరాటాలు చేసేవారు .ఇప్పటితో పోల్చుకుంటే రఘువీరారెడ్డి హయాంలో పార్టీ యాక్టివ్ గానే కనిపించేది .అయితే ఇప్పుడు మళ్లీ ఏపీ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పొలిటికల్ గా రఘువీరారెడ్డి యాక్టివ్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారు.అది ఏపీలో మొదలుకాగానే రఘువీరా రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని , ఇక అప్పటి నుంచి రఘువీరా యాక్టివ్ అవుతారని ప్రచారం జరుగుతోంది.
రాహుల్ పాదయాత్ర తరువాత రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటానని రఘువీరా ఈ నెల 14వ తేదీన రాహుల్ యాత్ర తరువాత రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటానని గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ప్రకటించారు.రాహుల్ పాదయాత్ర మన ప్రాంతంలోకి వచ్చిన సమయంలో భారీగా వెళ్లి ఆయనకు మద్దతు తెలుపుదామని గ్రామస్తులకు సూచించారట.ప్రస్తుతం తనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని , మడకశిర దేవస్థానంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని రఘువీరా రెడ్డి ప్రకటించారు.
ప్రస్తుతం రఘువీరారెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాలోని తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో సామాన్య రైతుగా గత మూడేళ్లుగా జీవితం గడుపుతున్నారు.పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఏపీ ల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి ఉండడం, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఒత్తిడి, తదితర కారణాలతో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన కనుక పార్టీ తరఫున యాక్టివ్ అయితే మళ్లీ ఆయనకు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.