నందమూరి బాలకృష్ణ 107వ సినిమా టైటిల్ దాదాపుగా ఫైనల్ అయినట్లే కనిపిస్తోంది.నిన్న మొన్నటి వరకు రెండు టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెడ్డి గారు అనే టైటిల్ ని ఈ సినిమాకు ఫిక్స్ చేశారని సమాచారం అందుతుంది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఒక మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ వారంలోనే ఆ మంచి సమయం ఉండబోతుందని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ ఈ సినిమా లో చాలా పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది.బాలకృష్ణ ద్వి పాత్రాభినయం చేశాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ వారం లో టైటిల్ మరియు మరో స్టిల్ ని దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.
ఇదే సమయం లో సినిమా కు సంబంధించిన విడుదల తేదీ విషయం లో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బాలకృష్ణ రెడ్డి గారు సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తే బాగుంటుంది అని అంతా భావిస్తున్నారట.ఆ డేట్ కి రెడ్డి గారు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది కనుక డిసెంబర్ లో విడుదల చేయడం పెద్ద కష్టమేమీ కాక పోవచ్చు.







