మాజీ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కీలక ప్రకటన చేశారు.ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత తన రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఈ నెల 14 తర్వాత రాజకీయాలపై చర్చించుకుందామని పేర్కొన్నారు.తన రాజకీయాలపై వారం, పది రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
రాహుల్ జోడో యాత్ర నేపథ్యంలో భారీగా జనంతో వెళ్లి పాదయాత్రలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అదేవిధంగా పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేద్దామని సూచించారు.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.మళ్లీ తన రాజకీయ జీవితం పున: ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.







