పూరీ జగన్నాథ్ అంటేనే మాస్ ఆడియెన్స్ ను తన డైలాగ్స్ తో మెప్పిస్తాడు.ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
టాలీవుడ్ లోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఈయనకు ఇప్పుడు మాత్రం గడ్డు కాలం ఎదురైంది అనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
పూరీ జగన్నాథ్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్.కానీ లైగర్ మరిన్ని అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.
దీంతో ఈయన కెరీర్ మరోసారి ఢీలా పడిపోయింది.
లైగర్ కంటే ముందే వీరిద్దరి కాంబోలో జనగణమణ కూడా ప్రకటించాడు.
అయితే లైగర్ భారీ ప్లాప్ తో ఈ సినిమా ఆగిపోయింది.ఇక పూరీ జగన్నాథ్ ఇప్పటి వరకు తెర వెనుక ఉండి తన టాలెంట్ ను చూపించాడు.
అయితే ఇప్పుడు తెర ముందుకు వచ్చి తన టాలెంట్ చూపించి అందరిని ఆశ్చర్య పరిచాడు.ఇటీవలే దసరా కానుకగా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరీ కూడా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో జర్నలిస్టుగా నటించి తన నటనలో కూడా తన మార్క్ చూపించాడు.గతంలో ఏమాయ చేసావే సినిమాలో నటించిన ఈయన అప్పుడప్పుడు తన సినిమాల్లో కనిపించే వాడు.కానీ ఇప్పుడు మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించాడు.ఈ సినిమా హిట్ అవ్వడంతో పురీ ఇకపై డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరి రాబోయే రోజుల్లో పూరీ నటనలో కూడా రాణిస్తాడో లేదో చూడాలి.







