బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ఆయన తెలుగులో నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.
చేతికి కట్టు ఉండి పిడికిలి బిగించి పైకి ఎత్తి చూపిస్తున్న ఒక చేయిని పోస్టర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా క్రియేటివ్ గా చూపించడం జరిగింది.దర్శకుడు నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దానిపై ఉన్న కొటేషన్ మరియు ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా చూపరులను ఆకట్టుకుంటుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.
ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి, భారీ బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అవ్వబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.వచ్చే సంవత్సరంలో లేదా 2024 సంవత్సరం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.
టైం ట్రావెల్ కథ తో రూపొందిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని కలిగి ఉంటుందని సినిమా కాన్సెప్ట్ కూడా అంతర్జాతీయ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు బలంగా చెబుతున్నారు.ఈ సినిమా లో అమితా బచ్చన్ ఉండడం వల్ల కచ్చితంగా సినిమా కు మరింత అదనపు ఆకర్షణ అనడం లో ఎలాంటి సందేహం లేదు.అద్భుతమైన విజువల్స్ తో పాటు మరెవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా లో సన్నివేశాలు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఉంటాయని దర్శకుడు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.1000 కోట్లు అనేది ఈ సినిమా కు చాలా తక్కువ అంటూ వసూళ్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.







