ఇన్ఫోసిస్ పై ఆ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమెరికా కోర్టు లొ దావా

ఇన్ఫోసిస్ పై అమెరికా కోర్టులో దావా వేసిన మాజీ ఉన్నతోద్యోగి 10-10-2022 Mon 14:08 ఇన్ఫోసిస్ పై అమెరికా కోర్టులో వ్యాజ్యం వేసిన మాజీ వైస్ ప్రెసిడెంట్ చట్ట విరుద్ధ, వివక్షా విధానాలు అనుసరిస్తున్నట్టు ఆరోపణమార్చడానికి ప్రయత్నించగా, వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు వివరణఇన్ఫోసిస్ కు వ్యతిరేకంగా ఆ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్/మానవ వనరుల నియామకం విభాగం) జిల్ ప్రెజీన్ అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.భారత మూలాలు కలిగిన, పిల్లలు కలిగిన మహిళలను, 50 ఏళ్లు దాటిన వారిని నియమించుకోవద్దని తనను ఇన్ఫోసిస్ కోరినట్టు పేర్కొన్నారు.అమెరికాలో వివక్షాపూరిత ఉద్యోగ నియామకాలకు వ్యతిరేకంగా ఇన్ఫోసిస్ ఎదుర్కొంటున్న రెండో న్యాయ వ్యాజ్యం ఇది.2018లో ఇన్ఫోసిస్ తనను నియమించుకునే నాటికి తనకు 59 ఏళ్లు అని ప్రెజీన్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఎగ్జిక్యూటివ్ ల నియామకాలకు స్పెషలిస్ట్ గా పనిచేసినట్టు చెప్పారు.వయసు, లింగం, సంతానం ఆధారంగా ఇన్ఫోసిస్ లో వివక్ష చూపించే ప్రబల సంస్కృతిని చూసి తాను షాక్ కు గురైనట్టు ఆమె వివరించారు.

 The Company's Former Vice President Filed A Lawsuit Against Infosys In An Americ-TeluguStop.com

ఈ సంస్కృతిని మార్చడానికి మొదటి రెండు నెలల్లో ఎంతో ప్రయత్నం చేశానని, కానీ ఇన్ఫోసిస్ పార్ట్ నర్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు పిటిషన్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube