ప్రకాశం జిల్లాలో తుళ్లూరు మండలం లక్కవరపు గ్రామం సచివాలయం సెక్రటరీపై లంచం తీసుకుంటున్నారంటూ అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ పంచాయతీ సెక్రటరీ ఏ సుజాత దేవీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పంచాయతీ వర్క్ బిల్ ఫైల్ ప్రొసెస్ చేసేందుకు సర్పంచ్ దత్తయ్య నుంచి ముప్పై వేలు రూపాయలు డిమాండ్ చేశారు.పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు సుజాత దేవిని పట్టుకున్నారు.
ఈ క్రమంలో అవినీతికి పాల్పడే వారు ఎవరైనా భయపడకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.







