తెలంగాణ మంత్రి హరీష్ రావును టీఎన్జీవో నేతలు కలిశారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో డీఏలు, ఈహెచ్ఎస్ స్కీం అమలు చేయాలని టీఎన్జీవో నేతలు కోరారు.పీఆర్సీ పెండింగ్ జీవోలు విడుదల చేయాలని వినతిపత్రంలో కోరారు.
టీఎన్జీవో నేతల వినతిపై స్పందించిన మంత్రి హరీష్ రావు ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసిఆర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు.







