ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మర్యాదపూర్వకంగా కలిశారు.గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం సమీక్షకు గైర్హాజరుపై వివరణ ఇచ్చారు.
అనారోగ్యం వల్ల సమావేశానికి హాజరుకాలేదని వంశీ తెలిపారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించకపోవడానికి అనారోగ్యమే కారణమని సీఎం జగన్ కు వల్లభనేని వంశీ వివరించారు.
ఈ సందర్భంగా తరువాత నిర్వహించే గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని జగన్ సూచించారని సమాచారం.వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానని వంశీ తెలిపారు.
అనంతరం గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.







