అటవీ జంతువులు తరచుగా అడవి చుట్టూ ఉన్న రహదారులపై వాహనాలను అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది.విదర్భ, గుజరాత్ వంటి ప్రాంతాల్లో అయితే పులుల గుంపు హైవేపై కూర్చొని హాయిగా సేద తీరుతూ ఉంటాయి.
వీటితో పాటుగా ఖడ్గమృగాలు కూడా రోడ్ల మీదకి వస్తుంటాయి.సాధారణంగా ఇవి వాహనాలకు ఎలాంటి హాని తలపెట్టవు.
అయితే తాజాగా ఒక ఖడ్గమృగం ఏకంగా లారీనే ఢీకొట్టింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆదివారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక ఖడ్గమృగం రోడ్డు మీదికి రావడం గమనించవచ్చు.
ఆ తర్వాత అది అటువైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ట్రక్కును ఢీకొట్టింది.కొమ్ముతో ఈ ఖడ్గమృగం దాడి చేసినట్లు కనిపించింది.
అంత వేగంగా వస్తున్న దానిని ఢీ కొట్టగానే ఆ ఖడ్గమృగం గాయపడింది.రోడ్డుపై కాసేపు కిందపడిపోయింది.
వర్షం వల్ల రోడ్డు జారుడుగా ఉండటంతో లేచినప్పుడు మళ్లీ అది కింద పడింది.అనంతరం ఈ ఖడ్గమృగం తిరిగి అడవిలోకి ఎలా వెళ్తుందో ఈ వీడియోలో చూపించారు.

ఈ వీడియోను పంచుకుంటూ, ‘ఖడ్గమృగాలు మా ప్రత్యేక స్నేహితులు.మేం వాటి నివాస స్థానంలో ఎలాంటి రహదారి ఉల్లంఘనను సహించం.హల్దీబరీలో జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో గాయపడిన ఖడ్గమృగాన్ని రక్షించాం.దీంతో పాటు ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు జరిమానా విధించాం.కజిరంగలోని జంతువులను కాపాడేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, 32 కిలోమీటర్ల మేర ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్‌ను రూపొందిస్తున్నామ”ని హిమంత బిశ్వ శర్మ చెప్పారు.ఈ వీడియోకి ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







