తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని టీఆర్ఎస్ నేతలు కలిశారు.ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.క్విడ్ ప్రోకోతో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నారన్న అంశంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఈసీ స్పందించి తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.







