వ్యాపారస్తులు ‘కస్టమర్లే మాకు దేవుళ్ళు‘ అని బోర్డులు పెట్టడం మీరు చూసే వుంటారు.కానీ అది గోడమీద ఓ అలంకారం మాత్రమే.
చాలామంది వ్యాపారస్తులకు ఆ విషయం మనసులో ఉండదు.అవును, తాజాగా ఆ విషయాన్ని నిజం చేస్తూ ఓ సంఘటన చోటుచేసుకుంది.
ఈమధ్యకాలంలో ఇలాంటివి అనేకచోట్ల చోటుచేసుకుంటున్నాయి.సదరు సంస్థలు దానిపైన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా, అలాంటివి మరలా మరలా రిపీట్ అవుతున్నాయి అనడంలో సందేహమే లేదు.
తాజాగా ఓ కస్టమర్ ఆన్లైన్లో ఓ పిజ్జా ఆర్డర్ చేసాడు.కట్ చేస్తే ఆర్డర్ రావడంతో బాగా ఆకలిగా ఉందేమో.తినడం స్టార్ట్ చేసాడు.వెంటనే ఒక గాజు ముక్క అతని పంటికి తగిలింది.
ఏదో పొరపాటున వచ్చింది అనుకొని, తినడం ఆరంభించాడు. ఈసారి పెద్ద గాజు ముక్క తన కంటికి కనబడింది.
దాంతో చిర్రెత్తి అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.అయితే, దీనిపై స్పందించిన పోలీసులు ‘ఆ విషయంతో మాకు సంబంధం లేదు, సదరు కంపెనీకి నువ్వు రిపోర్ట్ చెయ్!’ అని పోలీసులు అతనికి ఉచిత సలహా ఇచ్చేసారు.
దాంతో అతగాడు ఆ సో కాల్డ్ సంస్థ స్పందిస్తూ… నిర్వహణా నిబంధనలను ఉల్లంఘించబోమని, ఈ ఘటనపై దర్యాప్తు చేసి, ఆ తప్పు చేసినవారికి దండిస్తామని ప్రకటించింది. ఇంతకీ ఆ సంస్థ పేరు ఏమంటే… ప్రముఖ పిజ్జా బ్రాండ్ అయిన డోమినోస్.
అవును, ముంబైకు చెందిన ఒక వ్యక్తి దానినుండే ఒక పిజ్జా ఆర్డర్ చేశాడు.అతగాడు పిజ్జా ఆర్డర్ చేయగా బాక్స్‌లో పిజ్జా డెలివరీ చేశారు.
బాక్స్ తెరిచి పిజ్జా తింటుండగా, మధ్యలో మూడు గాజు ముక్కలు అతనికి కనబడటంతో దీన్ని ఫొటో తీసి, అతడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.







