ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలను చంపేస్తాం అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం అన్నది ఎక్కువ అయిపోయింది.ఇప్పటికే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలకు ఈ విధంగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ కి చెందిన ఒక నటీ తండ్రికి ఈ విధంగానే బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయట.పూర్తి విరాళాల్లోకి వెళితే.
హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటి అయిన షెహ్‌నాజ్ గిల్ తండ్రి సంతోక్ సింగ్ సుఖ్ కు చంపేస్తాం అని బెదిరింపులు వచ్చాయట.కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సంతోక్ సింగ్ సుఖ్ చంపుతామని ఫోన్ ద్వారా బెదిరించారట.
దీపావళి పండగ లోగా హత్య చేస్తామని హెచ్చరించారట.షెహ్‌నాజ్ గిల్ తండ్రి సంతోక్ సింగ్ తాజాగా బియాస్ నుంచి టరంటాన్ బయలు దేరాడు.ఈ నేపథ్యంలోనె మార్గం మధ్యలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చిందట.అది కూడా ఓ ఫారెన్ నెంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చిందట.
ఆయన కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగా,అవతలినుంచి కొంతమంది యువకుల గొంతులు వినపడ్డాయట.ఆ యువకులు సంతోక్ సింగ్‌ను మొదట బూతులు తిట్టడం మొదలు పెట్టి దీపావళి కంటే ముందే ఆయన్ని చంపుతామని వాళ్లు బెదిరించడంతో పాటు ఇంట్లోకి ప్రవేశించి మరీ ఈ దారుణానికి ఒడిగడతాము అంటూ అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట.

దీంతో భయపడిపోయిన సంతోక్ సింగ్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు.తనకు వచ్చిన చావు బెదిరింపు కాల్స్ గరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే అతని బెదిరించిన నిందితులు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.అయితే ఇంతకు ముందు కూడా సంతోక్ పై హత్యా ప్రయత్నం జరిగిందట.బీజీపీలో చేరిన కొత్తలో అతనిపై దాడి జరిగిందట.2021 డిసెంబర్ లో సంతోక్ బీజేపీలో చేరిన కొద్ది రోజులకు ఓ డాబా దగ్గర ఆయన పై గన్ ఫైరింగ్ జరిగిందట.సంతోక్ త్రుటిలో తప్పించుకొని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారట.







