మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క సక్సెస్ మీట్ తాజాగా జరిగింది.ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.
ఆయన ప్రజారాజ్యం విషయాన్ని జనసేన విషయాన్ని ప్రస్తావించి మెగా ఫాన్స్ లో ఎలాంటి కన్ఫ్యూజన్, కంగారు లేకుండా క్లియర్ చేశాడు.ప్రజారాజ్యం పెట్టిన సమయంలో సీట్ల ని డబ్బులకు అమ్ముకున్నాడు అంటూ చాలా మంది ఆరోపించారు, కానీ ఆయన ప్రజారాజ్యం పెట్టడం ద్వారా అప్పులు చేశారు.
ఆ అప్పులను తీర్చడం కోసం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ పక్కన ఉన్న అత్యంత ఖరీదైన స్థలం ను తక్కువ రేట్ కి అమ్మేసి ఆ డబ్బుతో ప్రజారాజ్యం కోసం చేసిన అప్పులను తీర్చాడంటూ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రజారాజ్యం ద్వారా సాధించలేని లక్ష్యాలను ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ సాధిస్తాడని ఆ లక్ష సాధనలో ప్రతి ఒక్కరం ఆయనకు తోడు ఉంటాము అంటూ మెగా ఫ్యాన్స్ అందరూ జనసేన వైపు ఉండాలన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేనకు మద్దతుగా ఉండాలి అన్నట్లుగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మాట్లాడాడు.మొత్తానికి ఇన్నాళ్లు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి సీట్లని అమ్ముకొని కోట్లు దండుకున్నాడంటూ చిరంజీవి పై ఉన్న అపవాదులు ఈ నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చి మెగా ఫాన్స్ లో ఎలాంటి అనుమానాలు లేకుండా చేశాడు.పార్టీ పెట్టడం ద్వారా అప్పులు చేసిన చిరంజీవి ఆ అప్పులను తీర్చడం కోసం ఖరీదైన భూమిని అమ్మడం అంటే నిజంగా మామూలు విషయం కాదు, గతంలో ఎన్నో సార్లు ఇతర పార్టీ నుంచి అవకాశాలు వచ్చినా కూడా చిరంజీవి మాత్రం ఎటు వెళ్లకుండా ఉన్నాడు.ఆయన సంపాదించుకోవాలనుకుంటే రాజకీయంగా భారీ మొత్తం సంపాదించుకునే అవకాశం ఉంది.
కానీ ఎప్పుడూ కూడా రాజకీయాల్లో చిరంజీవి సంపాదించుకునేందుకు ఆసక్తి చూపించలేదు.తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చిరంజీవి భవిష్యత్తులో ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి.
చిరు గ్రేట్ లీడర్ అనడంలో సందేహం లేదు అంటూ మెగా ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







