యాదాద్రి జిల్లా:మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కూడా లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మవతి ఫంక్షన్ హాల్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అధ్యక్షతన శనివారం మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టుల కోసం,కమిషన్ల కోసం మునుగోడులో అనవసరపు ఎన్నికలు తీసుకువచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమ్యూనిస్టులను విమర్శిస్తారా అని మండిపడ్డారు.
కులాల పేరుతో,మతాల పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించి దాడి చేయాలని బీజేపీ ఆలోచన చేస్తుందన్నారు.సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు,మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని,కమ్యూనిస్టులను విమర్శించే ముందు చరిత్రను తెలుసుకోవాలన్నారు.
బీజేపీ పన్నుతున్న కుట్రలను మునుగోడు ప్రజలు తిప్పి కొడితే తప్ప అభివృద్ధి జరగదని వారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







