బిడెన్ కి షాక్...కొడుకు చేసిన నేరాలపై పక్కా ఆధారాలు...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై గడిచిన కొంత కాలంగా నేరారోపణలు వస్తున్న నేపధ్యంలో పలు దఫాలుగా ఆయన ఫామ్ హౌస్ పై సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రంప్ ను దోషిగా చూపిస్తూ పలు కీలక ఆధారాలు సేకరించినట్టుగా మీడియా కు వెల్లడించారు.అయితే బిడెన్ కావాలనే ట్రంప్ ను టార్గెట్ చేశారని కావాలనే ట్రంప్ పరువు పోయేలా అధికారులను ఉసిగోల్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

 Shock To Biden Sure Evidence Of His Son's Crimes , Biden, Son's Crimes, Us Attor-TeluguStop.com

ఈ పరిస్థితుల నేపధ్యంలో బిడెన్ వర్గం చంకలు గుద్దుకుంది కూడా….కానీ తాజాగా బిడెన్ కి షాక్ ఇచ్చేలా మరొక సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ పన్ను నేరాలకు సంభందించి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని అవి తమ వద్ద ఉన్నాయని ఫెడరల్ ఏజెంట్స్ ప్రకటించారు.హంటర్ ఆయన సతీమణిని విచారించడానికి కావాల్సిన పక్కా ఆధారాలు తాము సేకరించామని విచారణ చేపట్టడానికి ఇవి సరిపోతాయని వారు తెలిపారు.

అయితే హంటర్ పై కేసు పెట్టాలా లేదా అనే విషయాన్ని ప్రాసిక్యూట్ తెల్చుతుందని అన్నారు.అంతేకాదు.

తుపాకి కొనుగోలు విషయంలో కూడా తప్పుడు వివరాలు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయని ఏజెంట్స్ తెలిపారు.అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమితులైన అమెరికా అటార్నీ డేవిడ్ బిడెన్ కొడుకు హంటర్ పై తీర్పు చెప్పాల్సి ఉండటంతో సర్వత్రా ఉత్ఖంట నెలకొంది.అయితే ఫెడరల్ ఏజెంట్స్ చట్టానికి విరుద్దంగా వ్యక్తి యొక్క సమాచారాన్ని బయటకు చెప్పడం సరైనది కాదని హంటర్ తరపు న్యాయవాది విమర్శించారు.ఇది పూర్తిగా వ్యక్తిగత కక్ష కారణంగా అనిపిస్తోందని హంటర్ అమాయకుడంటూ ఆయన తరపు న్యాయవాది వాదిస్తున్నారు.

కాగా ఇదే పన్ను వ్యవహారాల విషయంలో బిడెన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ట్రంప్ పై పలు కేసులు పెట్టారని హంటర్ పై కేసులకు ట్రంప్ ప్రమేయం ఉండదు కానీ, ట్రంప్ పై వచ్చిన కేసులకు బిడెన్ ఉండరని మేము అనుకోవడం లేదని ట్రంప్ మద్దతు దారులు విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube