స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లో విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.కాగా ఈ చిత్రం దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్,జయం రవి,కార్తీ, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇటీవలే సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది.
రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కాస్త మిక్స్డ్ తాత తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లను సాధించింది.ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్లను వసూళ్లను చేసింది.ఉంది కాకుండా ఈ రేంజ్ లో కలెక్షన్స్ లో రాబట్టిన ఆరవ తమిళ సినిమాగా కూడా రికార్డులను సృష్టించింది.గతంలో కూడా తమిళ సినిమాలు ఈ రేంజ్ లోనే రికార్డులను సృష్టించాయి.ఇకపోతే వీకెండ్ వరకు ఈ వసూళ్లు రూ.350కోట్లను దాటుతాయని అంచనా వేస్తున్నారు.

అలాగే గతంలో విడుదలైన తమిళ సినిమాల రికార్డులను కొల్లగొట్టి మరి సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది అని అంచనా వేస్తున్నారు.కాగా తమిళనాడులో విడుదలైన మొదటి రోజే రూ.100కోట్ల కలెక్షన్స్‌ను అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది.ఇకపోతే ఈ సినిమాను చిత్ర బంధం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం విడుదల కాగా రెండవ భాగాన్ని కూడా రూపొందించనున్నారు.ఈ సినిమా విడుదల అయినా రోజు నుంచి ఆరు నెలల నుంచి 9 నెలల తర్వాత రెండవ భాగం కూడా విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు.







