దసరా పండుగ సందర్భంగా నవరాత్రులలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు చేస్తూ ఉంటారు.కొందరు ఆడుకునే చిన్న పిల్లలు బూర ఊదుతూ ఆడుకుంటూ ఉంటారు.
దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఇలాంటి ఒక ఘటన జరిగింది.జీవితంలో మరిచిపోలేని పెద్ద శబ్ధంతో బూర ఊదుతూ సౌండ్ పొల్యూషన్ చేసిన కొందరు యువకులకు పోలీసులు గట్టి గుణపాఠం చెప్పారు.
పోలీసుల గుణపాఠం వల్ల ఆ యువకులు గుంపులోనూ రోడ్డు మీద కూడా బూర ఊదలంటేనే వణుకు వచ్చేలా చేశారు.దసరా పండుగ సందర్భంగా జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న కొందరు యువకులు పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ బూర ఊదుతూ, రోడ్డుపై గోల గోల చేస్తూ వెళ్తున్నారు.
వారు చేస్తున్న శబ్ధాలకు స్థానిక ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.అది చూసిన పోలీసులు వారికి తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపారు.పెద్ద స్వరంతో బూర వాయించిన వారిని పోలీసులు అడ్డుకుని ఒకరి చెవుల్లో మరొకరు పుంగి వాయించేలా చేశారు.ఇదే కాకుండా రోడ్డు మధ్యంలో చెవులు పట్టుకుని బూర వాయిస్తూ, ఆడుతున్న యువకులను పోలీసులు రోడ్డుపై కూర్చోబెట్టారు.
పోలీసులు బూర వాయించేవారిని ఒకరి చెవుల్లో మరొకరు పుంగీ వాయించుకోవాలని చెప్పటంతో ఆ శబ్ధాలకు తోటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో వారికి అప్పుడు అర్థమైంది.

దారిన వెళ్లే వారి చెవుల్లో పుంగీ వాయించే వికృత చేష్టలను అదుపు చేసేందుకు పోలీసులు ఈ పద్ధతిని అవలంభించారని పోలీసులు చెబుతున్నారు.ఇలాంటి వికృత చేష్టలను చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందాయని పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకు చాలా మంది ప్రజలు ఈ వీడియోను చూశారు.ఈ వీడియోను చూసిన వారందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటున్న కొంతమంది యువత మారడం లేదని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







