గాడ్ ఫాదర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 48 గంటల సమయం ఉంది.అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతుండటంతో మెగా అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.
చిరంజీవి కెరీర్ లోని భారీ టార్గెట్ లలో గాడ్ ఫాదర్ మూవీ కూడా ఒకటని కామెంట్లు వినిపిస్తున్నాయి.గాడ్ ఫాదర్ నైజాం హక్కులు 22 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ హక్కులు 13.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.
ఈ సినిమా ఏపీ హక్కులు ఏకంగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా 70 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేయడం గమనార్హం.ఓవర్సీస్ లో 7.5 కోట్ల రూపాయలకు, కర్ణాటక హిందీలలో ఈ సినిమా హక్కులు 6.50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.మొత్తం 92 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాలి.

ఆచార్య సినిమా సక్సెస్ సాధించి ఉంటే ఈ సినిమాకు మరింత ఎక్కువ బిజినెస్ జరిగి ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.గాడ్ ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్ నటించడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా ఈవెంట్లలో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి మరింత కృషి చేస్తున్నారు.గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ పైనే చిరంజీవి తర్వాత సినిమాలకు బిజినెస్ జరగనుంది.
అందువల్ల ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ సినిమా పాజిటివ్ రిజల్ట్ ను అందుకుంటే మోహన్ రాజా తర్వాత సినిమాలు కూడా తెలుగులోనే తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.
సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







