గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బంగారం అక్కగా శాంతి ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.బంగారం ఒకటి చొప్పున అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఇలా బంగారం అంటూ శాంతి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది ఈ క్రమంలోనే ఈ వీడియోని డీజే గా క్రియేట్ చేయడంతో ఎంతో మంది సెలబ్రిటీలు బంగారం చెప్పనా అంటూ పెద్ద ఎత్తున రీల్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా బంగారం చెప్పనా అంటూ బుల్లితెర నటి మంజుల పెద్ద ఎత్తున సందడి చేశారు.
తెలుగు బుల్లితెరపై డాక్టర్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరిటాల నిరుపమ్ తన భార్య మంచులా కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే.డాక్టర్ బాబు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో వేసే పంచ్ డైలాగులకు సంబంధించిన వీడియోలు పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.
ఇకపోతే తాజాగా మంజుల తన భర్తతో కలిసి బంగారం చెప్పనా అంటూ చేసిన రియల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో భాగంగా నిరుపమ్ చుట్టూ మంజుల బంగారం ఒకటి చొప్పున అంటూ చివరిలో చీ.పోరా అనేసింది.తన చేష్టలకు విసుగు చెందిన డాక్టర్ బాబు ఏకంగా మంజుల పీక పిసకపోయి తనని మెడ పట్టి బయటకు గెంటేశారు.ప్రస్తుతం ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పెద్ద ఎత్తున నేటిజెన్లను, అభిమానులను ఆకట్టుకోవడంతో ఈ వీడియో కోసం వైరల్ గా మారింది.ఇక వీరిద్దరూ మంజుల నిరూపమ్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ విపరీతమైన సొంతం చేసుకున్నారు.