రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ ఇపుడు యూత్ కి ఐకాన్ లాగా మారాడు.అవును, తాజాగా ఆకాశ్ అంబానీకి టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో చోటు దక్కింది.
వాల్డ్ రైజింగ్ స్టార్స్ జాబితాను టైమ్100 నెక్స్‌ట్ పేరుతో తాజాగా విడుదల చేసింది టైమ్స్.ఈ జాబితాలో భారతదేశం నుంచి ఒకే ఒక్కరికి చోటు దక్కడం అరుదయిన ఘటన అనే చెప్పుకోవాలి.అయితే భారత సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ లీడర్ అమ్రాపాలీ గన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
30 ఏళ్ల ఆకాశ్ అంబానీ తాజాగా రిలయన్స్ జియో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసినదే.అంతకన్నా ముందు అంటే 22 ఏళ్ల వయస్సులోనే బోర్డు మెంబర్‌గా బాధ్యతల్ని మనోడు చేపట్టాడు.ఈ సందర్భంగా టైమ్స్ పేర్కొంటూ… అతను దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్ , ఫేస్‌బుక్ నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారని వివరించింది.
కాగా జూన్ 27న రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు.అదే రోజున ముకేశ్ అంబానీ తనయుడు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా ఉన్న ఆకాశ్ అంబానీని ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్రవేశారు.
ఇకపోతే ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మేజర్ పట్టభద్రుడయ్యారు.రిలయన్స్ గ్రూప్ డిజిటల్ సేవలు, వినియోగదారు రిటైల్ ప్రతిపాదనల ద్వారా రిలయన్స్ జియో సృష్టించిన అన్ని సంచలనాల్లో ఆకాశ్ భాగస్వామిగా ఉండటం తెలిసినదే.జియో 4జీ అభివృద్ధిలో అతని పాత్ర కూడా ఉంది.ఇప్పుడు జియో 5జీ లాంఛ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.2017లో భారతదేశంలోని యూజర్ల కోసం జియోఫోన్ రూపొందించడంలో ఇంజనీర్ల బృందంతో కలిసి పనిచేశారు.లక్షలాది మంది యూజర్లు 2జీ నుంచి 4జీకి మారడానికి ఈ డివైజ్ ఉపయోగపడింది.
ఇప్పుడు 500 మిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకునే లక్ష్యానికి నాయకత్వం వహించనున్నారు.