నయనతార చెల్లిగా నటించడంపై స్పందించిన మెగాస్టార్.. ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా విషయంలో చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవడమే కాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 28వ తేదీ అనంతపురంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్లాన్ చేశారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తప్పకుండా హీరోయిన్స్ ఉంటారు.

అయితే మొదటిసారి హీరోయిన్ లేకుండా చిరంజీవి సినిమాలలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నయనతార నటించినప్పటికీ మెగాస్టార్ కి హీరోయిన్ గా కాకుండా చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

అయితే గతంలో వీరిద్దరూ కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో చెల్లెలుగా నటించడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.కథ మొత్తం విన్న తర్వాత ఈ పాత్రకు నయనతార అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని అందరం భావించం అందుకే తనని చెల్లెలి పాత్రలో నటించడానికి తీసుకున్నామని ఈ విషయం చెప్పగానే నయనతార కూడా ఓకే చెప్పిందని చిరంజీవికి వెల్లడించారు.ఇక ఈ సినిమా కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఇలాంటి ఒక ప్రాధాన్యత ఉన్న కథలో నటిస్తున్న సమయంలో అసలు ఆమె నా ఇది వరకు సినిమాలో హీరోయిన్ గా నటించిందనే ఆలోచన కూడా రాలేదని చిరంజీవి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు