20 సెకన్లలో చుక్కలు చూపించిన యువతి.. ఏకంగా 40 చెప్పు దెబ్బలు

ప్రస్తుత సమాజంలో ఎవరైనా ఆకతాయిలు తమను వేధిస్తే యువతులు సైలెంట్‌గా తల వంచుకుని వెళ్లి పోతున్నారు.ఇంటా బయటా ఇలాంటి వేధింపులు తమకు మామూలే అనుకుని పెద్దగా పట్టించుకోరు కొంత మంది.

 The Young Woman Who Showed Dots In 20 Seconds 40 Slaps At Once , Girl, Viral Lat-TeluguStop.com

అయితే కాలేజీలలో, రోడ్లపై వెళ్లే సమయంలో ఇలాంటి సాధారణంగా అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతుంటాయి.కొంత మంది ఆకతాయిలు దీనిని అలుసుగా తీసుకుంటారు.

సైలెంట్‌గా ఉంటే మరింత రెచ్చిపోతారు.అసభ్యకర కామెంట్లు చేయడం, ఆపై లైంగికంగా వేధించడం, ఇంకా అడుగు ముందుకు వేసి అఘాయిత్యాలు చేయడం వంటివి చేస్తారు.

ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో అమ్మాయిలకు, మహిళలకు ఇలాంటి వేధింపులు నిత్యకృత్యంగా మారాయి.అయితే ఓ అమ్మాయి మాత్రం తనకు ఎదురైన వేధింపులను చూస్తూ ఊరుకోలేదు.

ఆకతాయికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

యూపీలోని జలౌన్‌ జిల్లా ఓరాయి నగరంలో ఓ యువతి తనను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తికి బుద్ధి చెప్పింది.బాగా మద్యం తాగి, ఆ మత్తులో సదరు వ్యక్తి ఆ అమ్మాయిని వేధించాడు.

కోపంలో ఊగిపోయిన ఆ యువతి సదరు తాగుబోతుపై తిరగబడింది.తన కాలికి ఉన్న చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించింది.

కేవలం 20 సెకన్లలో ఏకంగా 40 చెప్పు దెబ్బలు కొట్టింది. దీంతో ఏ రేంజిలో వాయించి ఉంటుందో అంతా ఊహించుకోవచ్చు.

మరెప్పుడూ, ఎవరి మీదా లైంగిక వేధింపులు పాల్పడకుండా తగిన శాస్తి చేసింది.ఈలోపు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మహిళను వేధించిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే విపరీతంగా వైరల్ అయింది.

బాగా బుద్ధి చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube