సోషల్ మీడియా ప్రభంజనంతో చిన్నారుల్లోనూ ఎంతో టాలెంట్ దాగుంది అని అందరికీ తెలిసొచ్చింది.వయసు చిన్నదే అయినా వీరు చూపించే ప్రతిభ మాత్రం పెద్ద వారికి ఏ మాత్రం తీసిపోదు.
ఇక పాటలకు చిన్న పిల్లలు చాలా అద్భుతంగా లిప్ సింక్ ఇస్తూ.డ్యాన్సులు కూడా చేస్తూ పాపులర్ అవుతున్నారు.
తాజాగా ఇద్దరు బాలికలు కూడా అద్భుతంగా డ్యాన్స్ మూవ్స్ చేస్తూ చక్కటి ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోని నెటిజన్లు పదేపదే చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
రాజేష్ ఖన్నా హీరోగా చేసిన ఆరాధన సినిమాలోని ‘మేరే సప్నోకీ రాణీ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ పాట ఒక ఎవర్ గ్రీన్ హిట్.ఇప్పటికీ దీనిని వింటూ ఎంజాయ్ చేసేవారు ఉన్నారు.
అయితే ఇదే పాటకు చిన్నారులు కాలు కదిపారు.ఒక చిన్నారి పాట లిరిక్స్ కి అనుగుణంగా హావభావాలు పలికిస్తూ చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ వేసింది.
మరొక బాలిక ఈ చిన్నారికి తోడుగా స్టెప్పులు వేసింది.ఈ వీడియోను రమేష్ భండారి చెత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.“సూపర్ కిడ్స్,” అనే క్యాప్షన్ ఈ వీడియో చూసి జోడించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అయితే ఒక బాలిక ముందు పళ్లు ఊడిపోయాయి.దీన్ని చూసి కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
తొర్రిపళ్ల పాప అదరగొట్టేసిందిగా అని సరదాగా ఆమెను పొగుడుతున్నారు.ఈ బాలిక టవల్‌ను కూడా కాస్త వెరైటీగా కట్టుకుంది.
ఆ క్రియేటివిటీని కూడా నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.ఇక మిగతా వారు వావ్, సూపర్ అద్భుతంగా చేశావ్అని కితాబిస్తున్నారు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







