విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.యూనివర్సిటీ పేరు మార్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.1986లో ఏర్పాటైన యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.ఎన్టీఆర్ నిర్మించిన యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారని నిలదీశారు.







