అపస్మారక స్థితిలోకి వెల్లిన వృద్దులు .ఆసుపత్రి కి తరలించిన స్థానికులు.
పరిస్థితి విషమం .పొలం అమ్మడం లేదని కక్షతో దాడి చేశారని బాధితుల ఆరోపనలు .పొలం వద్ద ఒంటిరిగా ఉన్న వృద్దులపై ధాడి చేసి హత్యా యత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాబు పేట మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో సోమవారం మద్యాన్హం చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నవాబు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పులు మామిడి గ్రామానికి చెందిన వృద్దులు తెలుగు యాదయ్య ఆయన భార్య పోలం వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన సోమన్నోల్ల రామక్రిష్ణ రెడ్డి ఆయన భార్య తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్యలు కలిసి కర్రలతో వృద్దులపై ధాడికి పాల్పడటంతో యాదయ్య ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి
అపస్మారక స్థితిలో ఉన్న వృద్దులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు .బాధితులు నవాబు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం అమ్మడం లేదనే కక్షతోనే దాడి చేశారు .బాధిత కుటుంబీకుల ఆరోపన .పొలం అమ్మ మని పలు మార్లు ఒత్తిడి చేయగా పొలం అమ్మేందుకు నిరాకరించడంతో నే ధాడికి పాల్పడినట్లు భాదితులు ఆరోపించారు.







