ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి తన టాలెంట్ తో బుల్లితెర అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాలో కొనసాగుతున్నారు ఫైమా. పటాస్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైనటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి ఫైమా బిగ్ బాస్ ఇచ్చేటటువంటి టాస్కులలో ఎంతో చాకచక్యంగా పాటిస్పేట్ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ఫైమా తల్లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఫైమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తన తల్లి మాట్లాడుతూ నేడు మేము ఇలా ఉన్నామంటే అందుకు కారణం తన బిడ్డ పైమా అంటూ తన తల్లి తెలియచేశారు.నా బిడ్డ గురించి నా కుటుంబం గురించి మొదట్లో ఎన్నో విమర్శలు చేశారో వాటిని విని నేను వద్దని వారించిన తాను మాత్రం బయటకు వెళ్లి తానేంటో నిరూపించుకొని నేడు మాకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని ఫైమా తల్లి పేర్కొన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కూడా తాను ఎంతో అద్భుతంగా ఆడుతోందని,తనకు గాయం అయినప్పుడు నేను తల్లడిల్లిపోయాను అయితే హౌస్ లో ఉన్నటువంటి వారందరూ తనని మంచిగా చూసుకోవడంతో మనసుకుదట పడిందని ఆమె ఈ స్థాయికి రావడానికి కారణం ప్రేక్షకులేనని అదే ప్రేక్షకులు తనని బిగ్ బాస్ విన్నర్ గా నిలబెడతారు అంటూ ఈమె ఫైమా తప్పకుండా విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







