వైరల్: ఈ పిజ్జాని చూస్తే మీకు తినాలనే మూడు, ఉత్సాహం, కోరిక చచ్చిపోతుంది.. పొరపాటున చూడకండి!

సోషల్ మీడియా రోజురోజుకీ విస్తరిస్తూ పోతోంది.ఈ క్రమంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు.

 Viral: If You See This Pizza, You Will Die Of Three, Excitement And Desire To Ea-TeluguStop.com

కొంతమంది ఎంతో వ్యయప్రయాసలు కోర్చి చేసిన వీడియోలకు వ్యూస్ రావడంలేదు.మరికొంతమంది ఏదో టైం పాస్ చేస్తూ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న విషయాలు రేపు కనుమరుగు కావచ్చు.కానీ కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట్లో తమ ప్రతాపం చూపిస్తుంటాయి.

వీటిలో అధికంగా డ్యాన్స్, స్టంట్స్ చేయడం, కుకింగ్ వంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యంగా ఆహారం విషయంలో చేసే ప్రయోగాలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి.

ఎందుకంటే ఆహారం అనేది మన దైనందిత జీవితంలో ఓ భాగం కనుక.ఇకపోతే మ్యాగీ, మోమోస్ వంటి వంటకాలతో చేసే ప్రయోగాలు మీరు ఎన్నో చూసి ఉండొచ్చు.

కానీ ఇప్పుడు ఓ వ్యక్తి పిజ్జాతో కూడా వెరైటీ ఫుడ్ ట్రై చేశాడు.అయితే అతడి చర్యను చూసిన పిజ్జా ప్రియులు తమ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు.పిజ్జా పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి.జున్ను, మొక్కజొన్న, పుట్టగొడుగులు, పనీర్‌తో తయారైన ఈ పదార్థాన్ని తినేందుకు భోజన ప్రియులు ఆబగా ఎదురుచూస్తుంటారు.

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పిజ్జా సాస్‌కు బదులుగా చాక్లెట్, చీజ్‌కు బదులుగా ఐస్‌క్రీమ్ వేసి పిజ్జా తయారు చేశాడు.ఈ క్లిప్ లో ఒక వ్యక్తి మొదట చాక్లెట్ సాస్‌ను పిజ్జా బేస్‌పై అప్లై చేసి, ఆపై కూరగాయలను పెడతాడు.దీనిని ఓవెన్ లో ఉంచి, పిజ్జా తయారు చేస్తాడు.అనంతరం పిజ్జాపై వెనిల్లా ఐస్ క్రీం, స్ట్రాబెర్రీ ఐస్ క్రీం యాడ్ చేస్తాడు.ఈ వీడియోను రేడియోకారోహన్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.దీనిని వేలాది మంది వీక్షించగా చాలా మంది లైక్ చేశారు.

వైరల్ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.పిజ్జా పరువు తీసేసారు.

ఇది చూడటానికి అసహ్యంగా ఉంది.అని ఒక వినియోగదారు కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube