లైగర్ నష్టాలు..13 కోట్లు వెనక్కి ఇవ్వడానికి అంగీకరించిన పూరి!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది.

 Liger Losses Puri Agreed To Return 13 Crores Details, Liger Losses., Puri ,promo-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ సినిమాకి మాత్రం ఊహించని స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి.ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.

ఈ క్రమంలోని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున భారీ ధరలకు ఈ సినిమాని కొనుగోలు చేశారు.

ఇలా భారీ ధరలకు కొనుగోలు చేసినప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో నష్టపోయారు.ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ పై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తూ తాము చెల్లించిన డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై పూరి జగన్నాథ్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Crore Rupees, Puri Jagannath, Distributors, Liger, Puri-Movie

లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఈయన కొంత మొత్తంలో డబ్బును ఈయనకి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆంధ్రకు ఆరు కోట్లు, నైజాం 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్ 2.25 కోట్ల రూపాయలను వెనక్కి తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.మరి ఈ విషయం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కోవడంతో ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సందిగ్ధంలో పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube