బీజేపీ విమోచన దినోత్సవమని, టీఆర్ఎస్ సమైక్యత దినోత్సవమనే పేరుతో వేడుకలు నిర్వహిస్తూ అసలు చర్చను పక్కదోవ పట్టించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.ఆనాటి జమీందారీ వ్యవస్థ, భూస్వాముల గడీలపై చర్చ జరగాలన్నారు.
తెలంగాణలో భూమి పంచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు.అదేవిధంగా సంవత్సరం పాటు స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.







