నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న ఆహా అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ కి రంగం సిద్ధమైంది.
డిజిటల్ మీడియాలో దూసుకెళ్తున్న ఆహాలో అన్ స్టాపబుల్ షో కూడా అదిరిపోయే రేంజ్ లో హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ 2 కూడా త్వరలో రాబోతుంది.
అన్ స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్ తోనే అదరగొట్టాలని ఫిక్స్ అయ్యారు ఆహా టీం.అందుకే మొదటి రెండు ఎపిసోడ్స్ లోనే స్టార్ సెలబ్రిటీస్ ని దించుతున్నారు.ముందు బాబాయ్ కోసం అబ్బాయి గెస్ట్ గా వస్తారని టాక్.బాలయ్య అన్ స్టాపబుల్ షోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తారట.
నందమూరి ఫ్యాన్స్ కి ఈ ఎపిసోడ్ పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు.ఇక మరోపక్క సెకండ్ ఎపిసోడ్ గా మెగాస్టార్ చిరంజీవిని కూడా గెస్ట్ గా దించేస్తున్నారట.
అసలైతే అన్ స్టాపబుల్ సీజన్ 1 లోనే చిరు గెస్ట్ గా రావాల్సి ఉన్నా అప్పుడు ఎందుకో కుదరలేదు.ఇక సీజన్ 2 లో చిరు, ఎన్.టి.ఆర్, నాగార్జున, వెంకటేష్ లను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారట.మొత్తానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 అనుకున్న దాని కన్నా భారీగా ఉండబోతుందని అర్ధమవుతుంది.