టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన కృష్ణ కౌశిక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవకాశాల కోసం పెద్ద దర్శకులను కూడా సంప్రదించడం జరిగిందని తెలిపారు.ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరినీ కలిశానని కృష్ణ కౌశిక్ అన్నారు.
బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొన్న బాలాదిత్య సోదరుడైన కృష్ణ కౌశిక్ మాట్లాడుతూ కొన్ని సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా సినిమా లేదని చెప్పారని ఆయన అన్నారు.
నా పేరు తెలియకపోయినా ముఖం చూసి గుర్తుపడతారని ఆయన పేర్కొన్నారు.
డైరెక్టర్లను ఎప్పుడు కలవాలో నాకు అర్థం కాదని ఆయన చెప్పుకొచ్చారు.పెద్దపెద్ద సినిమాలలో బాగా చేస్తావని నన్ను వద్దన్నారని కృష్ణ కౌశిక్ అన్నారు.
దూరదర్శన్ లో నేను చేసిన కిట్టూగాడు సీరియల్ ను త్రివిక్రమ్ బాగా చూసేవారని కృష్ణ కౌశిక్ అన్నారు.అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఆప్షన్ అని ఆయన కామెంట్లు చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఛాన్స్ ఇస్తానని చెప్పారు కాబట్టి ఛాన్స్ అయితే ఇవ్వలేదని కౌశిక్ అన్నారు.

రావు రమేష్ గ్రేట్ యాక్టర్ అని ఆయనకు చాలా లేట్ గా బ్రేక్ వచ్చిందని కృష్ణ కౌశిక్ తెలిపారు.మా నాన్నగారు తన కలలను నా ద్వారా, సోదరుడి ద్వారా తీర్చుకున్నాడని ఆయన చెప్పుకొచ్చారు.నాన్న హైట్, పర్సనాలిటీ ఆయనకు మైనస్ అయ్యాయని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

మా నాన్నగారిని ఇండస్ట్రీ పైకి రానివ్వలేదని ఆయన తెలిపారు.నాకు ఇప్పుడు జరిగిన అన్యాయం నాన్నకు అప్పటికే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో నాన్నను తొక్కేశారని కృష్ణ కౌశిక్ పరోక్షంగా కామెంట్లు చేశారు.నాన్న అందగాడు అని కృష్ణ కౌశిక్ అన్నారు.తమ్ముడికి కూడా సరైన బ్రేక్ రాలేదని కృష్ణ కౌశిక్ అన్నారు.బాలాదిత్య పాటలు బాగా రాస్తాడని మ్యూజిక్ బాగా చేస్తాడని కృష్ణ కౌశిక్ అన్నారు.







