సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది.టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు.

 Rebel Star Krishnam Raju Passes Away, Rebel Star, Krishnam Raju, Passed Away, To-TeluguStop.com

కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాదులోనే ఏఐజి హాస్పిటల్ లో చేర్పించారు.ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విశాద ఛాయలు అమ్ముకున్నాయి.

ఆయన మరణ వార్త విని అభిమానులు కూడా తీవదిబ్బందికి లోనయ్యారు.

కాగా కృష్ణంరాజు మొన్నటి వరకు కూడా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కూడా నటించారు.

అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ లో కూడా బాగానే పాల్గొన్నారు.ఇటీవల జరిగిన ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలలో కూడా పాల్గొన్నారు.

కానీ గత కొంతకాలంగా శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఎప్పటికప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు.

Telugu Krishnam Raju, Prabhas, Radheshyam, Rebel, Tollywood-Movie

కానీ తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో మరణించారు.కృష్ణంరాజు మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.కృష్ణంరాజు మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube