వెబ్ సిరీస్ ని రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే.. ఇంత పొగరా అంటూ ట్రోల్స్?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పూజ హెగ్డే వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Tollywood Heroine Pooja Hegde Reject Web Series Offer Pooja Hegde, Tollywood, We-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే కి సంబంధించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే పూజ హెగ్డే కి వెబ్ సిరీస్ అంటే అంత చులకనా? అంటూ ప్రచారం జరుగుతుంది.అసలు విషయంలోకి వెళితే.

పూజా హెగ్డే కి ఇటీవలే ఒక వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట.

అప్పుడు పూజ హెగ్డే ఆ వెబ్ సిరీస్ లో నటించను అంటూ సున్నితంగా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

దీంతో పూజా హెగ్డే ట్రోలింగ్స్ మొదలుపెట్టేశారు.వెబ్ సిరీస్ అంటే పూజా కి చులకన భావం ఉందని, అందువల్లే పూజా వెబ్ సిరీస్ లో అని చెప్పిందని, ఇంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం ఇంత బెట్టు పనికిరాదు అంటూ నెటిజన్స్ పూజా పై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తున్నారు.

అయితే నిజంగానే పూజా హెగ్డే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా? ఈ వార్తలు నిజంగానే నిజం ఉందా తెలియాలి అంటే పూజా హెగ్డే స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

Telugu Mahesh Babu, Pawankalyan, Pooja Hegde, Reject, Tollywood, Trivikram, Web-

ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భగవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇకపోతే ఇటీవలే పూజ హెగ్డే రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించగా ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube