కోపరేటివ్ బ్యాంక్‌లో రూ.10 లక్షలు కాజేసిన చిచ్చరపిడుగు.. వీడియో వైరల్!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర నగరంలోని డిస్ట్రిక్ట్ కోపరేటివ్ బ్యాంకులో పట్టపగలే దొంగతనం జరిగింది.గురువారం నాడు బ్యాంకు అధికారులు కస్టమర్లతో బిజీగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని ఓ అగంతకుడు రూ.10 లక్షలు కాజేసి పరారయ్యాడు.ఈ సంఘటన జైంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌముహాన్ పట్టణంలోని కోపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది.

 A Man Theft Of Rs. 10 Lakhs In Cooperative Bank.. Video Viral Cooperative Bank,-TeluguStop.com

ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి ఒక బాలుడు కావడం ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.ఈ బాలుడు పక్కా ప్లాన్‌తో డబ్బు కాజేయడానికి వచ్చాడు.

అతడు తన ప్లాన్ ప్రకారం మొదటగా బ్యాంకు క్యాషియర్ హరీష్ యాదవ్‌ వద్దకు వెళ్లి క్వశ్చన్లు అడుగుతూ ఎక్కడ డబ్బులు పెడతారో చూసుకున్నాడు.మంచి సమయం కోసం బ్యాంకు లోనే ఒక బల్లపై కూర్చున్నాడు.

ఇంతలోనే క్యాషియర్ చిన్న పనిపై తన క్యాబిన్ నుంచి బయటికి వెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ బాలుడు క్యాష్ కౌంటర్‌లోకి ప్రవేశించాడు.

ఆ బాలుడు లోపలికి వెళుతున్న విషయాన్ని కూడా ఇతర బ్యాంక్ సిబ్బంది గమనించలేదు.

దాంతో ఇంకేముంది ఆ బాలుడు రెండు 5 లక్షల రూపాయల కట్టలను పాలిథిన్‌ కవర్‌లో వేసుకుని అక్కడినుంచి శరవేగంగా ఉడాయించాడు.

ఈ చిచ్చరపిడుగు చేస్తున్న చోరీ అంతా కూడా సీసీటీవీ కెమెరాల్లో క్లారిటీగా రికార్డయింది.అయితే తన క్యాబిన్‌లో ఉండాల్సిన రూ.10 లక్షలు మాయం కావడంతో క్యాషియర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు.ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం తెలిసి అతడు మరింత షాక్ అయ్యాడు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కోపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌కు చేరుకొని బ్యాంకు సీసీ టీవీ పుటేజ్‌తో పాటు సమీపంలోని ఓ సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నారు.దొంగను వీలైనంత తొందరగా పట్టుకుని కటకటాల వెనక్కి పంపుతామని జైట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.ఈ ఘటనలో బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం కనిపిస్తోందని భూమి వికాస్ బ్యాంక్ ఛైర్మన్ ధనిరామ్ సిసోండియా అన్నారు.ఒక దొంగ తన బ్యాగ్‌లో రెండు రూ.5 లక్షల కట్టలను వేసుకుని అక్కడినుంచి వెళ్ళిపోవడం మీరు వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.రూ.10 లక్షలు హాయ్‌గా తీసుకుని పోతుంటే.బ్యాంకు ఉద్యోగులు తెలుసుకోకపోవడం ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube