పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది.స్టేషన్ లో సీజ్ చేసి ఉంచిన బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయి.
భారీ శబ్దాలతో పేలడంతో సమీప గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా మంటల ధాటికి పీఎస్ అంతా ధ్వంసమైంది.







