పురంధరేశ్వరి కి బీజేపీలో ప్రాధాన్యం తగ్గిందా ?

బిజెపి కీలక నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరికి బిజెపిలో ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతున్నట్టే కనిపిస్తుంది.మొదట్లో ఆమెకు  ఉన్న  రాజకీయ నేపథ్యం , బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఏపీలో ఉన్న చరిష్మా ఇవన్నీ లెక్కలు వేసుకుని బీజేపీ అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది .

 Has Purandhareshwari's Priority In Bjp Decreased Bjp, Ap Bjp, Purandareswari, Da-TeluguStop.com

  అయితే ఆమె మాత్రం అంత యాక్టివ్ గా కనిపించకపోవడం,  బిజెపిని బలోపేతం చేసే విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం,  ఇటీవల కాలంలో టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబానికి దగ్గరవుతున్నట్లుగా అనుమానాలు పెరిగిపోతూ ఉండడంతో , ఆమె వ్యవహారంపై బీజేపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతుంది.

    ఈ కారణంగానే గత నెలలో ఒరిస్సా ఇంఛార్జి బాధ్యతలను, అలాగే చత్తీస్ ఘడ్,  బిజెపి ఇన్చార్జి బాధ్యతల నుంచి, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ  పురందరేశ్వరిని బిజెపి అధిష్టానం తప్పించినట్లుగా ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

  వాస్తవంగా మంచి వాక్చ్చాతుర్యం ఉండడం తో పాటు  బలమైన సామాజిక వర్గం నేపథ్యంలో పురందరిశ్వరి కి ఏపీలో బిజెపిని బలోపేతం చేసే బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది .

   

Telugu Ap Bjp, Bjp, Purandareswari, Somu Veeraju-Politics

     ‘ఏపీలో విస్తృత చేరికల కమిటీ ‘ ఏర్పాటు చేసి దాని బాధ్యతలు అప్పగించినా, ఇప్పటివరకు ఒక్క సమావేశం నిర్వహించకపోవడం , చేరికలు లేకపోవడం, తదితర కారణాలతో బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉందట.  టిడిపి నుంచి పెద్ద ఎత్తున కీలక నాయకులను బిజెపిలో చేర్చుతారని అధిష్టానం ఆశలు పెట్టుకోగా , ఆమె ఏమాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం, టిడిపికి దగ్గర అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తుండడంతో , ఆమెకు  బీజేపీ లో ప్రాధాన్యం బాగా తగ్గడానికి కారణంగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఏపీ బీజేపీ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube