పురంధరేశ్వరి కి బీజేపీలో ప్రాధాన్యం తగ్గిందా ?

బిజెపి కీలక నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరికి బిజెపిలో ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతున్నట్టే కనిపిస్తుంది.

మొదట్లో ఆమెకు  ఉన్న  రాజకీయ నేపథ్యం , బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు, ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఏపీలో ఉన్న చరిష్మా ఇవన్నీ లెక్కలు వేసుకుని బీజేపీ అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది .

  అయితే ఆమె మాత్రం అంత యాక్టివ్ గా కనిపించకపోవడం,  బిజెపిని బలోపేతం చేసే విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం,  ఇటీవల కాలంలో టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబానికి దగ్గరవుతున్నట్లుగా అనుమానాలు పెరిగిపోతూ ఉండడంతో , ఆమె వ్యవహారంపై బీజేపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతుంది.

    ఈ కారణంగానే గత నెలలో ఒరిస్సా ఇంఛార్జి బాధ్యతలను, అలాగే చత్తీస్ ఘడ్,  బిజెపి ఇన్చార్జి బాధ్యతల నుంచి, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ  పురందరేశ్వరిని బిజెపి అధిష్టానం తప్పించినట్లుగా ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

  వాస్తవంగా మంచి వాక్చ్చాతుర్యం ఉండడం తో పాటు  బలమైన సామాజిక వర్గం నేపథ్యంలో పురందరిశ్వరి కి ఏపీలో బిజెపిని బలోపేతం చేసే బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది .

    """/"/      'ఏపీలో విస్తృత చేరికల కమిటీ ' ఏర్పాటు చేసి దాని బాధ్యతలు అప్పగించినా, ఇప్పటివరకు ఒక్క సమావేశం నిర్వహించకపోవడం , చేరికలు లేకపోవడం, తదితర కారణాలతో బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉందట.

  టిడిపి నుంచి పెద్ద ఎత్తున కీలక నాయకులను బిజెపిలో చేర్చుతారని అధిష్టానం ఆశలు పెట్టుకోగా , ఆమె ఏమాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం, టిడిపికి దగ్గర అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తుండడంతో , ఆమెకు  బీజేపీ లో ప్రాధాన్యం బాగా తగ్గడానికి కారణంగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఏపీ బీజేపీ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.