ఫోటోగ్రాఫర్ సంపత్ ను అభినందించిన గవర్నర్ తమిళసై..

ఫోటోగ్రఫీలో జాతీయస్థాయి అవార్డు పొందిన ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ ను గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ అభినందించారు.జాతీయస్థాయిలో ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనపరిచిన సంపత్ ను రాజ్ భవన్ కు రావాల్సిందిగా రాజ్ భవన్ కార్యాలయం నుంచి సంపత్ కు వర్తమానం అందింది.

 Governor Tamilisi Congratulated Photographer Chava Sampath, Governor Tamilisi ,p-TeluguStop.com

సంపత్ ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిశారు.రాజభవన్ లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సంపత్ ను ఆమె అభినందించారు.

ఫోటోగ్రఫీ రంగంలో భవిష్యత్తులో మరిన్ని పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆమె సూచించారు.సంపత్ ను మెమెంటో, శాలువాతో ఆమె సత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube