ఫోటోగ్రాఫర్ సంపత్ ను అభినందించిన గవర్నర్ తమిళసై..
TeluguStop.com
ఫోటోగ్రఫీలో జాతీయస్థాయి అవార్డు పొందిన ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ ను గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ అభినందించారు.
జాతీయస్థాయిలో ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనపరిచిన సంపత్ ను రాజ్ భవన్ కు రావాల్సిందిగా రాజ్ భవన్ కార్యాలయం నుంచి సంపత్ కు వర్తమానం అందింది.
సంపత్ ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిశారు.
రాజభవన్ లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సంపత్ ను ఆమె అభినందించారు.
ఫోటోగ్రఫీ రంగంలో భవిష్యత్తులో మరిన్ని పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆమె సూచించారు.
సంపత్ ను మెమెంటో, శాలువాతో ఆమె సత్కరించారు.
నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.. రెగ్యులర్ గా తింటే ఏం అవుతుంది?