ఒక సినిమా విజయవంతం అయింది అంటే ఎంతో మంది భవిష్యత్తు మారిపోతుంది.అది ఒక సినిమా పరాజయం కూడా ఎంతో మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది.
అలాంటి ఒక పరిస్థితిని ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్ కల్లారా చూస్తున్నాడు.లైగర్ సినిమా ఎంతో పెద్ద హిట్ అవుతుందని పన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా ఘనవిజయం సాధిస్తుందని భావించి సొంతంగా డబ్బులు పెట్టి విడుదల చేయక అది కనీసం బడ్జెట్లో సగం కలెక్షన్స్ కూడా సాధించలేదు.
దాంతో పూరి జగన్నాథ్ భవిష్యత్తుపై అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి.ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటికే మొదలుపెట్టిన జనగణమన సినిమాకి సైతం కొబ్బరికాయ కోటకముందే గుమ్మడికాయ కొట్టే పరిస్థితి కనిపిస్తోంది.
లైజర్ సినిమాను పూరి జగన్నాథ్ తో కలిసి చార్మి సంయుక్తంగా నిర్మించారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్ల విషయం కూడా ఇప్పటికీ తేలడం లేదు వారికి ఎలాగోలా సగం డబ్బులు నాయనా కూడా వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ సమావేశం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు జనగణమన సినిమాకి కూడా బడ్జెట్ తగ్గించి పూరీ చేతిలోనే పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఓవైపు వార్తలు వస్తున్నాయి.నిజమేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

ఇక పూరి జగన్నాథ్ కలలు కలలుగా మారాయి అనుకున్నదొకటి అయింది ఒకటి అన్న చందంగా మారింది ప్రస్తుతం పూరీ పరిస్థితి.ఇప్పటికే ముంబైలో మఖం పెట్టి నెలకు 10 లక్షలు కడుతూ ఒక ఇంట్లో అద్దకుంటున్నాడు పూరి జగన్నాథ్.ఇప్పటికే తడిసి మోపడయింది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత అద్దె కట్టలేక ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూరికి ఇలాంటి కష్టమే వచ్చిందేంటి అని అందరూ అనుకుంటున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ సైతం తన పారితోషకంలో ఆరు కోట్లు తిరిగి ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.







