రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో వినాయకునికి అలంకరణ..

గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో వినాయక చవితిని పురస్కరించుకొని వ్యాపారస్తులు, ఎస్ బి జి యూత్, ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని మంగళవారం సుమారు రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు.ఆర్గనైజర్స్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి మెయిన్ బజార్లో ప్రతి ఏడాది చవితికి వినాయకున్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం జరుగుతుందని, ఉత్సవాల్లో వ్యాపారస్తుల సహకారంతో ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుందన్నారు.

 Vinayaka Idol Decorated With Two Crore Rupees Currency Notes In Guntur Mangalagi-TeluguStop.com

తొలి ఏడాది 5 లక్షల రూపాయలు కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకారం ప్రారంభించి, నేడు 16వ సంవత్సరం రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామివారిని అలంకరిస్తున్నట్లు వారు తెలియజేశారు.నోట్లతో అలంకరించిన గణనాథుని మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపకు పాత్రులు అయినారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube